బోగ‌త‌కు జ‌లక‌ళ‌..

by Aamani |
బోగ‌త‌కు జ‌లక‌ళ‌..
X

దిశ‌,ఏటూరునాగారం : తెలంగాణ న‌యాగ‌రాగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడు మండ‌లంలోని బోగ‌త జ‌ల‌పాతం జ‌ల‌క‌ళ సంత‌రించుకోని ప‌ర్య‌ట‌కుల‌ను కనువిందు చేస్తుంది. గ‌త రెండు, మూడు రోజులుగా ఏగువ దిగువ ప్రాంతాల‌లో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా భోగ‌త జ‌ల‌పాతం కు నీరు చేరి కొండ‌ల పై నుండి నీటిని జార వీడిస్తూ బోగ‌త జ‌ల‌పాతం జ‌ల‌క‌ళ సంత‌రించుకుంది. అయితే ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌ర్ష‌కాల‌ స‌మయంలో బోగ‌త జ‌ల‌పాత అందాల‌ను చూడ‌డానికి ప‌ర్య‌ట‌కులు పోటేత్తుతారు. కాగా అదివారం సెల‌వు రోజు కావ‌డంతో బోగ‌త అందాల‌ను వీక్షించేందుకు బోగ‌త జ‌ల‌పాతం వ‌ద్ద‌ ప‌ర్య‌టకుల తాకిడి మొద‌లైయింది.

ప‌ర్య‌ట‌కులు స‌హ‌కరించాలి : వాజేడు అట‌వీ శాఖ రెంజ్ అధికారి బానోత్ చంద్ర‌మౌళి..

ములుగు జిల్లా లోని భోగ‌త జ‌ల‌పాతం ను వీక్షించేందుకు వచ్చే ప‌ర్య‌ట‌కులు స‌హ‌క‌రించాలని అట‌వీ శాఖ రెంజ్ అధికారి బానోత్ చంద్ర‌మౌళి తెలిపారు. బోగ‌త జ‌ల‌పాతం కు ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే సంద‌ర్శ‌న‌కు స‌మ‌యం కేటాయించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అలాగే ములుగు జిల్లా వెంక‌టాపురం, వాజేడు మండ‌లాల‌లో ఉన్న మ‌రికొన్ని జ‌ల‌పాత‌ల‌ సంద‌ర్శ‌న‌కు అనుమ‌తులు లేవ‌ని ఏవ‌రు జ‌ల‌పాత‌ల వ‌ద్ద‌కు వెళ్ళ‌కూడ‌ద‌ని తెలిపారు. ఏవ‌రైన నిబంధ‌న‌లకు వ్య‌తి రేకంగా ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల‌లో ఉన్న జ‌ల‌పాత‌ల‌ను చూడ‌డానికి వెళ్లిన‌ట్టుయితే వారి పైన శాఖ‌ప‌రమైన చ‌ర్య‌లు తీసుకోవడం జ‌రుగుతుంద‌న్నారు.

Next Story

Most Viewed