CM చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం

by Satheesh |
CM చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. బుధవారం ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అనుభవం, దక్షత మనకు కావాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అపార అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన గొప్ప విజన్ ఉన్న లీడరని కొనియాడారు. నిత్యం రాష్ట్రాభివృద్ధికి కోసం పరితపించే నేత అని ప్రశంసలు కురిపించారు. ఏపీ పునర్నిర్మాణం కోసమే చంద్రబాబు మద్దతు కోరానని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అఖండ విజయం సొంత చేసుకుని చంద్రబాబు నాలుగోసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. పిఠాపురం నుండి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన పవన్.. డిప్యూటీ సీఎం పోస్ట్ దక్కించుకుని జాక్ పాట్ కొట్టారు.

Next Story

Most Viewed