- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అనుష్క శెట్టి?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సూపర్ మూవీతో పరిచయం అయినప్పటికీ తెలుగు హీరోల సరసన నటించి మెప్పించింది. కొద్ది కాలంపాటు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణించింది. కానీ నిశ్శబ్దం తర్వాత నుంచి సినిమాలకు దూరం అయింది. కారణం ఏంటో తెలియనప్పటికీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. గత ఏడాది ఈ అమ్మడు నవీన్ పొలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో అనుష్క ఓ సినిమా చేస్తుంది.
ఇది లేడీ ఓరియెంటెడ్‌గా మూవీగా తెరకెక్కబోతున్నట్లు టాక్. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం సినిమాలు చేస్తూ మళ్లీ మునపటిలా ఇండస్ట్రీలో రాణించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అనుష్క ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయాలని ఫిక్స్ అయిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. క్రిష్ డైరెక్షన్లో వచ్చే సినిమా విడుదల అయ్యాక వరుస మూవీస్‌కు సైన్ చేయనున్నట్లు టాక్. కమర్షియల్ సినిమాలు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంత బిగ్ సర్ప్రైజ్ ఊహించలేదని అంటున్నారు.