సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన..

by Sumithra |
సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన..
X

దిశ, ఎల్లారెడ్డి : ప్రతినెల మొదటి బుధవారం రోజున నిర్వహించే సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ లో స్థానిక ఎస్సై మహేష్, సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమంలో నకిలీ ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ లు, ఈ సిమ్ కార్డు మోసాలు, మోసపూరిత లింకులు, ఓటీపీలు వంటి నేరాల నివారణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియపరిచారు. మోసపూరిత కాల్స్ మెసేజ్ లు వచ్చినప్పుడు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తప్పనిసరిగా 1930 సైబర్ టోల్ ఫ్రీ నెంబర్, సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ నేరాలు, జరుగుతున్న మోసాల పట్ల విద్యార్థులు తమ తల్లిదండ్రులకు నేరుగా తెలియపరచాలని ఎస్సై విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed