బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్

by Aamani |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్
X

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పైన పోలీసులు పెట్టిన అక్రమ కేసును ట్విట్టర్ వేదికగా బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేల పైన అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రోటోకాల్ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపినందుకు పోలీసులు, ఎమ్మెల్యే పైనే ఏకపక్షంగా కేసు నమోదు చేయడం అక్రమం అన్నారు. పోటీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా,ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు.

Next Story

Most Viewed