- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి : బడే నాగజ్యోతి
దిశ,ములుగు ప్రతినిధి : మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నానని,తనను ఆదరించి ఆశీర్వదించాలని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి సత్యవతి రాథోడ్,జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, జడ్పిటిసి భవాని లతో కలిసి బడే నాగ జ్యోతి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి అంకిత్ కు అందించారు. ఈ సందర్భంగా ముందుగా గట్టమ్మ తల్లికి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ,మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డబ్బుల ముఠాతో వాళ్ళున్నారని,పేదింటి బిడ్డగా తానున్నానని అన్నారు.తనకు ఆస్తులు ,పాస్తులు ఏమి లేవని,తన బలం ,బలగం అంతా ప్రజలేనని, తన తండ్రి ప్రభాకర్, తండ్రి సమానులైన సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎల్లవేళలా తనకు ఉంటాయని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కు 10 సంవత్సరాల అధికారం ఇచ్చిన ములుగు కు ఏం చేసిందనీ ప్రశ్నించారు.
ఇన్ని ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ,మరోసారి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని , తనకు ఎలాంటి ఆస్తులు లేవని,కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదని భావోద్వేగానికి గురయ్యారు.తనకు ఒక్క సారి అవకాశం ఇస్తే ,ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, తనకు ఎలాంటి ఎజెండా లేదని,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన ఎజెండా అని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఎవరు కావాలో ప్రజలు ఆలోచించుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, రాష్ట్ర రహదారుల భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీను, మండలాల ఇన్చార్జ్ సమ్మరావు, గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఒడీసీ ఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎంపీపీ శ్రీదేవి, వాణిశ్రీ, బీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More...