కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి.. బీజేపీ

by Disha News Desk |
కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి.. బీజేపీ
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన ఎంపీ మాలోతు కవిత వ్యాఖ్యలపై రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రేస్ పార్టీలు రెండూ కలిసి డ్రామాలు చేస్తున్నాయని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ , టీఆర్ఎస్ పార్టీలు కలిసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని, దానికి నిదర్శనం బుధవారం జరిగిన దిష్టిబొమ్మ దగ్ధం, నిరసన కార్యక్రమాలే అని అన్నారు. భారత ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మహబూబాబాద్ పార్లమెంటు ఎంపీ కవిత తన స్థాయి, గతాన్ని మరిచి మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత కాంగ్రెస్‌లో ఉన్నారని, ఉద్యమం సమయంలో విద్యార్థుల బలిదానాలకు కారణం మీరు కాదా, ఇప్పుడు మీరు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు అంటే దయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది అంటూ విమర్శించారు. బీజేపీ లేక పోతే తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ బిల్ పాస్ అయ్యే సమయంలో పార్లమెంట్ హాల్లో టీఆర్ఎస్ ఎంపీలు లేరు అని బీజేపీ, సుష్మా స్వరాజ్ మద్దతుతో బిల్ పాస్ అయిందని, అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అన్నారు. అంతేకాకుండా నాడు తెలంగాణ ఉద్యమ ద్రోహులు నేడు తెలంగాణను పరిపాలిస్తున్నారన్నారు.

ఉద్యమ చరిత్ర తెలిసుకొని మాట్లాడాలని మోడీ, బీజేపీని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు లేదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేపూరి వెంకన్న, మేరెడ్డి సురేందర్, వెల్ది మల్లయ్య, చీకటి మహేష్, మదన్ లాల్, మోదిన్ నాయక్, రామ్మూర్తి, మోతిలాల్, ఆకుల శ్రీనివాస్ ,నవీన్ కుమార్, సంపత్ ,సందీప్, నాగరాజు,గోడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed