Pithapuram:పవన్ పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్.. జనసేన మహిళా నేతకు గాయాలు!

by Jakkula Mamatha |   ( Updated:2025-01-10 09:40:10.0  )
Pithapuram:పవన్ పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్.. జనసేన మహిళా నేతకు గాయాలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇవాళ(శుక్రవారం) పిఠాపురం(Pithapuram) పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలం కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ఇక్కడి నుంచి లాంఛనంగా ప్రారంభించారు. అయితే.. పవన్ కళ్యాణ్ రాకతో జనసేన కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అలాగే జనసేన ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ(Chella Laxmi) కూడా అక్కడికి చేరుకున్నారు.

ఈ క్రమంలో ఆమెకు(చల్లా లక్ష్మి) అనుమతి లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు(Police) తెలిపారు. దీంతో తోపులాట జరిగి ఆమె కింద పడటంతో తలకు గాయమైంది. ఈ తరుణంలో జనసేన నేతలు(Janasena Leaders), పోలీసులపై జనసేన వీర మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే ఇదేనా తమను ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక గాయపడిన చల్లా లక్ష్మికి అక్కడ ఉన్న మహిళలు సాయం చేశారు.

మరోవైపు పవన్ పిఠాపురం సభలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను కూడా పోలీసులు అడ్డుకున్నారు. కూటమి నేతను అని చెప్పినా వినకుండా పోలీసులు లోనికి వెళ్లనీయలేదు. దీంతో పోలీసుల పై వర్మ ఫైర్ అయ్యారు. వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతానంటూ వర్మ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి వర్మ సభ లోపలికి వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed