- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hydra: నెక్నాంపూర్ కూల్చివేతలపై ట్విట్టర్ వేదికగా హైడ్రా క్లారిటీ
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని మణికొండ వద్ద ఉన్న నెక్నాంపూర్ చెరువు(Neknampur Lake) ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra) కూల్చివేతలు కొనసాగిస్తోంది. ఈ కూల్చివేతలపై హైడ్రా అధికారులు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో.. రంగారెడ్డి జిల్లా, మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ లోని పెద్ద చెరువులో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారని తెలిపారు. పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో వెలిసిన విల్లాల అనుమతులు రద్దు చేసినా నిర్మాణాలు కొనసాగడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.
గురువారం హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారని, ఎఫ్టీఎల్ పరిధిలో వున్నాయని గతంలో కొన్నిటిని కూల్చినట్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారుల వివరించినట్లు చెప్పారు. అలాగే మున్సిపాలిటీ, ఇరిగేషన్ నోటీసులు పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగడంపై కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు ఇచ్చారని అన్నారు. దీంతో హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు ప్రారంభించారని, రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు వుండడంతో.. కోర్టుకు సమాచారం ఇచ్చి కూల్చివేతకు హైడ్రా చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కూల్చివేతల్లో మొత్తం 13 విల్లాలు కాగా.. ఒక్కొక్కటి 400 గల విస్తీర్ణంలో ఒన్ ప్లస్ టూ గా నిర్మాణం చేపట్టినవి ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.