High Court: బెనిఫిట్ షోలు రద్దుచేశామని.. ప్రత్యేక షోలకు అనుమతులేంటి? హైకోర్టు అసంతృప్తి

by Ramesh N |
High Court: బెనిఫిట్ షోలు రద్దుచేశామని.. ప్రత్యేక షోలకు అనుమతులేంటి? హైకోర్టు అసంతృప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గేమ్ చేంజర్ (Game Changer) సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై (Telangana High Court) తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటన దృష్ట్యా సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేయాలనుకోవడం సరికాదని పేర్కొంది. సినిమాలకు వచ్చే ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని ధర్మాసనం సూచించింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.

కాగా, గేమ్‌ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్‌ షోలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8న ఇచ్చిన సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ గొర్ల భరత్‌ రాజ్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్‌ ధాఖలు చేశారు. జస్టిస్ బి.విజయ్‌సేన్‌ రెడ్డి నిన్న, ఇవాళ విచారణ చేపట్టారు. ఈ మేరకు తదుపరి విచారణను వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed