గోడ కూలి ముగ్గురికి తీవ్ర గాయాలు

by Sridhar Babu |
గోడ కూలి ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, దమ్మాయిగూడ : శిథిలావస్థలో ఉన్న ఓ గోడను కూల్చుతుండగా ప్రమాదవశాత్తు మీద పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోని బండ్లగూడలో పటేల్ ఫామ్ హౌస్ లో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ చెన్నపురం గ్రామానికి చెందిన భస్వప్ప (54), శరణప్ప (30), లక్ష్మన్ (32) అనే ముగ్గురు కూలీలు బండ్లగూడలో పటేల్ ఫామ్ హౌస్ లో శిథిలావస్థకు చేరిన గోడను కూల్చుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు కూలీల మీద పడింది. పక్కనే ఉన్న తోటి కూలీలు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షత గాత్రులకు అంబులెన్స్ లోనే అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించారు. భస్వప్ప అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు అయినట్టు డాక్టర్ మనీష్ తెలిపారు. అనంతరం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

Next Story