TCS stock: ఆ ఒక్క కారణంతోనే దూసుకుపోతున్న టీసీఎస్ స్టాక్.. ఇన్వెస్టర్ల పంట పండినట్లే

by Bhoopathi Nagaiah |
TCS stock: ఆ ఒక్క కారణంతోనే దూసుకుపోతున్న టీసీఎస్ స్టాక్.. ఇన్వెస్టర్ల పంట పండినట్లే
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్ కు చెందిన ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్(Tata Consultancy Services Stock) ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. శుక్రవారం సెషన్లో మంచి లాభాల్లో కొనసాగుతోంది. ఈ స్టాక్ ఏగగా 5శాతం లాభంతో రూ. 4240 పైనే కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఇంకాస్త జోరు పెంచి ఎన్ఎస్ఈ (NSE)లో రూ. 4245.90 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇన్వెస్టర్లు ఈ షేర్లు కొనుగోలు చేసేందుకు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కిందటి సెషన్లో ఈ స్టాక్ రూ. 4038.85 వద్ద ముగిసింది. అయితే నేడు ఆరంభంలోనే ఒక్కో షేరుపై దాదాపు ర.160 వరకు పెరిగి 3 శాతానికిపైగా లాభంతో రూ. 4200 వద్ద ప్రారంభం అయ్యింది. అక్కడి నుంచి ఇంకా ముందుకు దూసుకెళ్తోంది.

ప్రస్తుతం టీసీఎస్ (TCS) మార్కెట్ విలువ రూ. 15.34 లక్షల కోట్లు. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 4592.25 ఉండగా..కనిష్ట ధర రూ. 3591.50గా ఉంది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ ధర దాదాపు 3శాతం పెరిగింది. నెల రోజుల్లో మాత్రం 4 శాతానికి పడిపోయింది. ఈ ఆరు నెలల్లో 8శాతం పుంజుకుని ఏడాది వ్యవధిలో మాత్రం ఈ స్టాక్ 14శాతం లాభాలను అందించింది.

ఇప్పుడు ఈ టాటా స్టాక్ (Tata Stock) పుంజుకునేందుకు ప్రధాన కారణం అక్టోబర్ -డిసెంబర్ (October -December)త్రైమాసిక ఫలితాల్లో రాణించడం. గురువారం రోజు ఈ కంపెనీ క్యూ 3 ఫలితాల(Q3 Results)ను వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే నికర లాభం 11.95శాతం పెరిగి రూ. 12,380కోట్లుగా నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే శుక్రవారం సెషన్లో స్టాక్ దూసుకుపోతోంది. కంపెనీ మార్కెట్ విలువ ఒక్క సెషన్ లోనే ఏకంగా రూ. 70వేల కోట్లకు పైగానే పెరిగింది.

బలహీన మార్కెట్ సెంటిమెంట్ ఉన్నా కూడా సెన్సెక్స్(Sensex), నిఫ్టీ(Nifty) ప్యాక్ లో టీసీఎస్, టాప్ గెయినర్ గా నిలిచింది. దీంతో పెట్టుబడిదారులకు మంచి లాభాలు వచ్చాయి. టీసీఎస్ మంచి రిజల్ట్స్ ప్రకటించిన క్రమంలో ఇతర ఐటీ కంపెనీలు టెక్ మహీంద్ర(Tech Mahindra,), హెచ్ఎసీఎల్ టెక్నాలజీస్(HACL Technologies), ఇన్ఫోసిస్(Infosys), విప్రో(Wipro) కూడా వరుసగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఐటీ ఇండెక్స్ దూసుకెళ్తుండగా..ఈ ఐటీ షేర్లు అన్నీ కూడా మంచి లాభాల్లోనూ ఉండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed