Vishal's health : విశాల్ ఆరోగ్యంపై హీరో కీలక వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-10 09:12:43.0  )
Vishals health : విశాల్ ఆరోగ్యంపై హీరో కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు విశాల్(Vishal) ఆరోగ్యం(Health)పై హీరో జయం రవి(Hero Jayam Ravi) కీలక వ్యాఖ్య(Key Comments)లు చేశారు. విశాల్ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మన ముందుకు వస్తారని..సింహంలా గర్జిస్తారని చెప్పారు. విశాల్ మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన ఎంతోమంది ప్రజలకు సహాయం చేశారని..ప్రస్తుతానికి ఆయనకు గడ్డుకాలం నడుస్తుందని జయం రవి కామెంట్ చేశారు. తన సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఇంటర్వ్యూలో రవి ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా విశాల్ మేనేజర్ సైతం ఆయన ఆరోగ్యం గూర్చి అభిమానులు ఆందోళన పడవద్దన్నారు. సోషల్ మీడియాలో విశాల్ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్ధన్నారు. వైరల్ ఫీవర్()Viral fever), తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారని క్లారిటీ ఇచ్చారు. వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెప్పిన మధగజరాజ (Madhagajaraja) సినిమా(Movie) ప్రమోషన్ ఈవెంట్ కు హాజరయ్యారని తెలిపారు.

కాగా విశాల్ హీరోగా నటించిన మదగజరాజ సినిమా 12ఏండ్లుగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. చైన్నైలో నిర్వహించిన ఆ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు హాజరైన విశాల్ మాట్లాడుతున్న సమయంలో చేతులు వణుకడం..నీరసంగా ఉండటం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో విశాల్ ఆరోగ్యంపై ఆయన అభిమానుల్లో ఆందోళన రేకెత్తింది. చివరకు ఆయన వైద్య బృందం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed