BRS: బీసీ రిజర్వేషన్లు వాటికి కూడా వర్తింపజేయాలి.. దాసోజు శ్రవణ్ డిమాండ్

by Ramesh Goud |
BRS: బీసీ రిజర్వేషన్లు వాటికి కూడా వర్తింపజేయాలి.. దాసోజు శ్రవణ్ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: బీసీ రిజర్వేషన్లు(BC Reservations) విద్యా, ఉద్యోగాలకు కూడా వర్తింపజేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్(BRS Leader Dasoju Sravan Kumar) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్ల(BC Reservations)ను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను పెంచడానికి నిజంగా కట్టుబడి ఉంటే, అదే పెంపుదల తెలంగాణలో విద్య మరియు ఉద్యోగాలకు ఎందుకు వర్తింపజేయట్లేదు? అని ప్రశ్నించారు. అలాగే స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్లను 42 శాతం వరకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని డిమాండ్ చేశారు. ఇక దీని వల్ల బీసీ వర్గాల ప్రజలకు నిజంగా సాధికారత లభిస్తుందని బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed