- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దుః మంత్రి సీతక్క
దిశ, ఏటూరునాగారంః రుణమాఫీ కాని రైతులను బ్యాంకర్లు ఇబ్బంది పెట్టొద్దని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఐటిడిఏ ఏటూరు నాగారం సమావేశ మందిరంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ పీవో చిత్ర మిశ్రాలతో కలిసి వ్యవసాయ, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రైతులను అన్ని విధాల ఆదుకోవడం కోసం రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని. మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ములుగు జిల్లాలో పని చేసే ఉద్యోగులు అందరూ కూడా మంచి సామర్థ్యం నైపుణ్యాలు ఉన్నవారే పని చేస్తున్నారని అదే విధంగా తమ సామర్థ్యాలను పదును పెడుతూ నూతన ఆలోచనలు, నూతన విధానాలు పరిపాలన కి తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. అంతకుముందు మండల కేంద్రంలో చేపల మార్కెట్ నుంచి వై జంక్షన్ వరకు సిఆర్ఆర్ 75 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ ను, సుమారు 30 లక్షల నిధులతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయం అదనపు గదుల భవనం ను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్ఓ అప్పయ్య, ఏరియా ఆసుపత్రి సూపర్ ఇండెంట్ జగదీశ్వర్, మెడికల్ క ప్రిన్సిపాల్ మెహన్ లాల్, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు, వైద్య అధికారులు, మండల ప్రత్యేక అధికారి సివిల్ సప్లై మేనేజర్ రాంపతి, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఎంపీఓ కుమార్, తదితరులు పాల్గొన్నారు.