- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ దూకుడు.. ఒకేసారి తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి బీజేపీ దూకుడు ప్రదర్శించింది. వరంగల్ తూర్పులో ప్రదీప్‌రావు, వరంగల్ వెస్ట్‌లో రావుపద్మారెడ్డి, భూపాలపల్లిలో చందుపట్ల కీర్తిరెడ్డి, వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, జనగామలో ఆరుట్ల దశమంతరెడ్డి, పాలకుర్తిలో లేగ రాంమోహన్‌రెడ్డి, డోర్నకల్‌లో భూక్య సంగీత, మహబూబాబాద్‌లో జాటోతు హుస్సేన్‌నాయక్‌లకు అభ్యర్థిత్వాలను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం ఉదయం తొమ్మిది స్థానాలకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 స్థానాలకు గాను తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు తొలిజాబితాలోనే ఖరారు చేయడం విశేషం. మిగతా మూడు నియోజకవర్గాలైన ములుగు, పరకాల, నర్సంపేటల అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది.
మహిళలకు ప్రియారిటీ.. అనుభవాన్ని పరిగణలోకి..!
మహిళలకు ప్రియారిటీ ఇవ్వాలనే పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో భూపాలపల్లి నుంచి చందుపట్ల కీర్తిరెడ్డికి, వరంగల్ వెస్ట్‌లో రావుపద్మారెడ్డి, డోర్నకల్ స్థానం నుంచి భూక్య సంగీతకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. మిగతా ఆరు స్థానాల్లోనూ పార్టీకి చేసిన సేవలు, జనాదరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సీట్ల కేటాయింపు జరిగినట్లుగా తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డికి మధ్య టికెట్ పోరు తీవ్రంగా నడిచింది. అయితే మహిళా అభ్యర్థిత్వం, పార్టీకి ఆమె చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని కేటాయింపునకే మొగ్గు చూపినట్లుగా సమాచారం. ఇక వరంగల్ తూర్పులో గంటారవి, కుసుమ సతీష్‌పేర్లను పరిశీలించినప్పటికీ టికెట్ కేటాయింపు హామీతోనే పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వైపే అధిష్ఠానం నిలిచింది.
మహబూబాబాద్‌లో హుస్సేన్‌నాయక్, భూపాలపల్లిలో చందుపట్ల కీర్తిరెడ్డి ముందునుంచే పార్టీ టికెట్ అంశంపై పెద్దగా సమస్య ఉండదనే ధీమాతోనే ప్రచారాన్ని ఆరంభించింది.వారి విశ్వాసాన్ని పార్టీ నిలబెడుతూ టికెట్ కేటాయింపు జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, జనగామలో ఆరుట్ల దశమంతరెడ్డి, వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్‌కు పార్టీకి చేసిన సేవలు, సీనియారిటీ వంటి కోణాల్లో టికెట్ కేటాయింపు జరిగినట్లు సమాచారం. పార్టీలో కొత్తగా చేరినప్పటికి డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభావం చూపగలదనే నమ్మకంతో నర్సింహులపేట జడ్పీటీసీ సంగీతకు అవకాశం కల్పించారు.
అసమ్మతి రగలకుండా చర్యలు..!
టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం పడినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పదవుల్లో లేదంటే ప్రకటించాల్సి ఉన్న స్థానాల్లోంచి బరిలో నిలిపేందుకు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన రాకేష్‌రెడ్డిని హైదరాబాద్‌కు పిలుపించుకున్న రాష్ట్ర నేతలు పార్టీలో ప్రాధాన్యం పెంచేందుకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నట్లు సమాచారం. పార్టీ బలంగా ఉన్నచోట్లలో గెలుపునకు వ్యూహరచనను పకడ్బందీగా చేయాలని యోచిస్తున్నారు.