- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొరం తరలింపునకు సహకరిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి...
దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్నకటాక్షపురం పెద్దచెరువులో అక్రమంగా మట్టి తరలింపునకు సహకరిస్తున్న ఇరిగేషన్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆత్మకూరు మండలాధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం అన్నారు. శుక్రవారం మండల బీజేపీ బృందం కటాక్షపూర్ చెరువులో మొరం తరలించడం వల్ల ఏర్పడిన బొందలను పరిశీలించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ కటాక్షపూర్ చెరువులో హైవే రోడ్డుకు అతి దగ్గరగా మొరము (గ్రావెల్ ) తీయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, లోతుకూడా ఇష్టం వచ్చినట్టుగా తీస్తున్నారన్నారు.
గతంలో తీసినగుంతల వలన చాలామంది ప్రమాదానికి గురై చనిపోయిన సంఘటనలు ఉన్నాయని, ఐబీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్టుగా తీస్తున్నాడన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే కాంట్రాక్టర్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతుందని తెలిపారు. కలెక్టర్ చొరవతీసుకొని అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్ కుమార్, బీజేపీ మండలప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, కిసాన్ మోర్చా నియోజవర్గం కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ముద్దెర గోపాల్, సురేందర్, పోరెడ్డి వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.