- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోస్టల్ కార్డుల ద్వారా జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి సందేశం..
దిశ, నర్సంపేట : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామి పథకాన్ని నిర్వీర్యం చేయడానికే రూ.30 వేల కోట్ల నిధులు తగ్గించినట్లు, అందుకే ఉపాధి హామీకూలీ పనిదినాలు తగ్గాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్నకారు రైతులే కూలీలుగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల నియోజక వర్గ వ్యాప్తంగా రైతులకు, కూలీలకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజక వర్గ వ్యాప్తంగా ఉత్తర యుద్ధాన్ని ఎమ్మెల్యే పెద్ది శనివారం ప్రారంభించనున్నారు. నియోజక వర్గంలోని రైతులందరిచే రెండు లక్షల పోస్టల్ కార్డుల ద్వారా జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రికి సందేశాన్ని పంపి నిరసన వ్యక్తం చేయాలని ఎమ్మెల్యే పెద్ది ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 8 గంటలకు దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఎమ్మెల్యే పెద్ది ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే నియోజక వర్గంలోని మండలాల్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా.. నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కల పల్లి, నర్సంపేట రూరల్ రాజపల్లె, ఖానాపురంలోని బుధారావుపేట, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట, నెక్కొండ పెద్ద కొర్పోల్ లో సైతం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రైతులంతా పార్టీలకు అతీతంగా పాల్గొని, వ్యవసాయానికి లబ్ది చేకూరాలనే న్యాయమైన డిమాండ్ అందరి భాగస్వామ్యం తప్పక ఉండాలని, రైతులంతా పెద్ద ఎత్తున ఇట్టి ఉత్తర యుద్ధంలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.