వరంగల్ నగర అభివృద్ధి పై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి

by Sridhar Babu |
వరంగల్ నగర అభివృద్ధి పై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి
X

దిశ, హనుమకొండ : వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డా. బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), పలు శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు పలు మార్లు సమావేశాలు నిర్వహించడం జరిగి సూచనలు అందించామని తెలిపారు.

గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి పాదించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలని అన్నారు. ఇప్పటికే కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి, పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, కమిషనర్ అశ్విని, కుడా వైస్ చైర్మన్ గౌతమ్, సీడీఏంఏ హరిచందన, రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed