వార్ రూమ్ సీజ్ : కాంగ్రెస్ ఆందోళనలు.. House arrests

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-14 05:35:33.0  )
వార్ రూమ్ సీజ్ : కాంగ్రెస్ ఆందోళనలు.. House arrests
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ రాజకీయ వ్యుహకర్త అరెస్ట్.. వార్ రూం సీజ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. వార్ రూమ్ సీజ్ ను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. తెలంగాణలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ, మల్లురవి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రోహిన్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా మంగళవారం సాయంత్రం ఇనార్బిట్ మాల్ సమీపంలోని కార్యాలయంపై సైబర్ క్రైం పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యుహకర్త సునీల్ కనుగోలును అరెస్ట్ చేయడంతో పాటు కార్యాలయంలోని కంప్యూటర్, లాప్‌టాప్‌లు సీజ్ చేశారు. సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపిస్తూ సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ముట్టడికి కాంగ్రెస్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Also Read....

కాంగ్రెస్‌లో పదవులు తెచ్చిన పంచాయితీ

Advertisement

Next Story

Most Viewed