Donald Trump: అమెరికాలో భారతీయుడికి మరో కీలక పదవి

by Shamantha N |
Donald Trump: అమెరికాలో భారతీయుడికి మరో కీలక పదవి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని మరో కీలక పదవికి భారతీయుడని నియమించేందుకు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అమెరికాలో మెడికల్ రీసెర్చ్ లను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌కు కొత్త డైరెక్టర్ గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించాలని ట్రంప్‌ (Donald Trump ) ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తాసంస్థ ‘వాషింగ్టన్‌ పోస్టు’ కథనంలో పేర్కొంది. ఎన్ఐహెచ్ డైరెక్టర్ పదవి రేసులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే, ట్రంప్ మద్దతు మాత్రం జై వైపు ఉందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. ఇక, జై స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఫిజీషియన్‌, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చిలో జై అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక స్టాన్‌ఫోర్డ్‌లో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ డెమోగ్రఫీ అండ్‌ ఎకనామిక్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఏజినింగ్‌ డైరెక్టర్‌గానూ ఉన్నారు.

సంస్కరణలు

ఇకపోతే, ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో సంస్కరణలు తీసుకురావడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఎన్ఐహెచ్ పై దృష్టి సారిస్తోంది. అందులో భాగంగానే ఎప్పట్నుంచో పదవిలో కొనసాగిస్తున్న వారిని తొలగించేందుకు యత్నిస్తోంది. కార్యవర్గంలో ఆర్థిక మంత్రిగా ఎంపికైన రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీని జై గత వారం కలిశారు. ఎన్‌ఐహెచ్‌పై తన ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. దీనికి కెన్నడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కెన్నడీ ఆధ్వర్యంలోని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ (Department of Health and Human Services) ట్రంప్‌ కార్యవర్గానికి ఎంతో కీలకమైంది. ఇది అమెరికాలో వైద్య సేవలను చూసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 50 బిలియన్‌ డాలర్ల విలువైన ఎన్ఐహెచ్ సంస్థ అమెరికా బయోమెడికల్‌ రీసెర్చిని పర్యవేక్షిస్తుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి ఇది అమెరికా హెల్త్ డిపార్ట్ మెంట్ విభాగం కింద పనిచేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed