Uttar Pradesh : యూపీలో మసీదు సర్వే బృందంపై రాళ్లదాడి..ఉద్రిక్తత

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-24 08:24:58.0  )
Uttar Pradesh : యూపీలో మసీదు సర్వే బృందంపై రాళ్లదాడి..ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని సంభాల్(Sambhal)లో షాహీ జామా మసీదు(Jama Masjid)లో సర్వే చేసేందుకు వచ్చిన అధికారుల బృందం(Survey team)పై స్థానికులు రాళ్లు, చెప్పులతో దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూడగా అది వైరల్ గా మారింది. షాహి జామా మసీదుకు చేరుకున్న సర్వే బృందంపై ఆ ప్రాంతంలోని ఓ వర్గానికి చెందిన కొందరు రాళ్లు, చెప్పులతో మూక దాడులకు దిగారు. అల్లరి మూకల దాడులతో ఆ ప్రాంతమంతా చెప్పులు, రాళ్లతో భీభత్సంగా కనిపించింది.16వ శతాబ్దపు దేవాలయం స్థానంలో షాహీ జామా మసీదును అక్రమంగా నిర్మించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో స్థానిక కోర్టు ఆదేశాల మేరకు అక్కడ సర్వే చేసేందుకు అధికారులు వెళ్లారు.

అధికారులు సర్వేకు వస్తున్నారని ముందే తెలుసున్న ఓ వర్గం వారు సర్వే బృందాన్ని మసీదులోని రాకుండా అడ్డుపడ్డారు. రాళ్లు, చెప్పులు విసురుతూ వారిపై దాడికి యత్నించారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అక్కడ రాళ్లు రువ్వేలా స్థానికులను రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి అల్లర్లు చెలరేగకుండా చర్యలు తీసుకున్నట్లుగా సంభాల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుజ్ కుమార్ చౌదరి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed