- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Thatikonda Rajaiah: రాజయ్యను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న గ్రామస్తులు
దిశ, వేలేరు : వేలేరు మండలం లోని చింతలతండా గ్రామంలో గురువారం రాత్రి తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొనడానికి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్యను గ్రామస్థులు అడ్డుకుని రాజయ్య గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుకు అడ్డంగా నిల్చుని ఎమ్మెల్యే రాజయ్య కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గ్రామానికి ఎమ్మెల్యే రాజయ్య ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, గ్రామంలో ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయని సమస్యలు పరిష్కరించకుండా గ్రామానికి ఎందుకు వస్తున్నావని ఎమ్మెల్యే రాజయ్యను ప్రజలు నిలదీశారు.
ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా, కడియం శ్రీహరికి అనుకూలంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారింది. స్థానిక పోలీసులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేస్తున్న యువకులను అక్కడి నుండి పంపించి వేసి ఎమ్మెల్యే రాజయ్యను తండాలోకి తీసుకువెళ్లారు. తండా పెద్ద ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తీజ్ బుట్టలను తీస్తున్న క్రమంలో కూడా యువకులు కడియం శ్రీహరికి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే రాజయ్య అసహనానికి గురైయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చింతలతండా గ్రామానికి రూ.10 లక్షల సీసీ రోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సమ్మిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.