- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డెక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రజాప్రతినిధుల భూభాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు అధికార, అంగ బలాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములు లాక్కున్నారని బాధితులు గోడును చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జాచేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన 600 మంది బాధితులు తరలి వచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఫ్లెక్సీలతో ప్రజాభవన్ ముందు ఆదోళనకు దిగారు.
మల్లారెడ్డిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇవాళ్టి ప్రజావాణి కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితులు సైతం ఆందోళనకు దిగారు. ప్రేమ్ సాగర్ రావు తమ నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మొదలు పెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తుండగా ఇందులో భూవివాదాలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.