- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VH complaint: చెంప వాయించినా తీరు మారలేద.. కంగనా వ్యాఖ్యలపై వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: పాపులారిటీ కోసమే బీజేపీ ఎంపీ, బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తమను బాధిస్తున్నాయని అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమెపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు అయి కోర్టుకు వస్తే ఆమె భాషలో మార్పు వస్తుందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీహెచ్.. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కంగనా రనౌత్ రాహుల్ గాంధీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడాతున్నారని, రాహుల్ చెత్తగా మాట్లాడతరాని, డ్రగ్స్ తీసుకుంటారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను తాను ఖండిస్తునన్నానన్నారు. ఏదైనా ఉంటే పార్లమెంట్ లో మాట్లాడాలని సూచించారు. అంతే తప్ప టీవీ చానెల్స్ లో రాహుల్ గాంధీని తూలనాడే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. రాహుల్ గాంధీకి ఆమె వెంటనే బహిరంగా క్షమాపణ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీతో పాటు బడగు, బలహీన వర్గాల ప్రజలందనిరీ ఆమె అవమానించిందని ద్వజమెత్తారు. రైతుల విషయంలో కంగనా అనుచితంగా మాట్లాడితే చెంప చెల్లుమనిపించారని అయినా ఆమె తన తీరు మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎంపీ కంగనాను జేపీ నడ్డా కంట్రోల్ చేయాలని సూచించారు.