కేటీఆర్‌ అరెస్ట్‌కు ముహూర్తం ఖరారు.. వేణుస్వామి మరో సంచలన జ్యోతిష్యం (వీడియో)

by GSrikanth |
కేటీఆర్‌ అరెస్ట్‌కు ముహూర్తం ఖరారు.. వేణుస్వామి మరో సంచలన జ్యోతిష్యం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తల జీవితాల్లో చోటుచేసుకునే కీలక పరిణామాలను ముందుగానే చెబుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటారు. ఇప్పటివరకు ఇయన చెప్పిన జ్యోతిష్యాల్లో 80 శాతానికి పైగా నిజమయ్యాయని ఆయన అభిమానులు చెబుతుంటారు. అక్కినేని నాగచైతన్య-సమంత, మెగా డాటర్ నిహారిక-చైతన్య జొన్నలగడ్డ విడాకుల విషయం, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయం ముందే చెప్పి సోషల్ మీడియా సపరేట్ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. తాజాగా.. చెప్పిన మరో ప్రిడిక్షన్ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఏడాదే కేటీఆర్ అరెస్ట్ అవుతారని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా.. ఆ సందర్భం దగ్గర పడుతుండటంతో ఆయన మరోసారి ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న వేణుస్వామి తాను ముందే చెప్పినట్లుగా ఈ ఏడాదే తప్పకుండా కేటీఆర్ అరెస్ట్ అయ్యి తీరుతాడని నొక్కి చెప్పారు. అయితే ఏ కేసులో అరెస్ట్ అవుతాడో చెప్పకపోవడం గమనార్హం. ఈ వార్త విన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఇప్పటికే కవిత అరెస్ట్ అయి జైల్లో ఉండగా.. కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నామని అంటున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కీలక నేతలంతా కష్టకాలంలో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న వేళ ఈ వ్యాఖ్యలు గులాబీ నేతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పేరుతో ఉన్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు వేణుస్వామి ప్రిడిక్షన్ చెప్పిన వీడియోను షేర్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే.. వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యంలో ఎంతవరకు నిజముందో ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story