- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ బడ్జెట్-2023లో చేనేతకు మిగిలేది గుండుసున్న: వెంకట్రాములు ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించడం దారుణమని తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు చేనేత ప్రఖ్యాతి గురించి గొప్పగా మాట్లాడారని.. కానీ బడ్జెట్లో చేనేతకు కేటాయించింది ఏమీలేదని, ఇది చేనేత అన్నలను దగాచేయడమేనన్నారు. కనీసం రూ.1000 కోట్లు అయినా కేటాయించి చేనేతను ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘాలు కోరుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. ప్రభుత్వాల విధానాలతో చేనేత పరిశ్రమ సంక్షోభానికి గురైతుందని, చేనేత కార్మికులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 15 వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయన్నారు. చేనేత, ఔళి రంగానికి కలిపి 468 కోట్లు కేటాయించినట్లుగా చెబుతున్నా అందులో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోని పవర్ లూమ్స్‌పై తయారయ్యే బతుకమ్మ చీరలకు 400 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో చేనేతకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నేతన్న బీమాకు 50 కోట్లు మిగతావి ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసుల నిర్వహణ కోసం కేటాయించారు. ఇక మిగిలింది చేనేతకు గుండుసున్నేనని ఇది నేతన్నలను అవమానపరచడమే అని తెలిపారు. ఈ బడ్జెట్ పునః పరిశీలన చేసి చేనేత పరిశ్రమనును రక్షించడానికి కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి బడ్జెట్లో రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు. లేనిచో చేనేత కార్మికుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.