- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వేములవాడ’ బీఆర్ఎస్‌లో రాజకీయ రగడ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో అధికార పార్టీలో రాజకీయ రగడ మొదలైంది. ఇక్కడి నుంచి టికెట్ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో ఆ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. కాగా, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని మహావృక్షంలా పాతుకుపోయారు. అయితే ఇటీవల అదే పార్టీకి చెందిన ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేములవాడ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
దీంతో ఆయన వర్గీయులు, బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఎమ్మెల్యేకు దడ పుట్టించే విధంగా ఏనుగుల బర్త్ డే సంబురాల జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఎమ్మెల్యేకు పౌరసత్వం రద్దుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వీరితోపాటు నియోజకవర్గంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, గోలి మోహన్ సైతం ఎమ్మెల్యే టికెట్ తమకే ఇస్తారంటూ ఎవరికి వారుగా ఆశవాహ దృక్పథంతో ఉండడం గమనార్హం. అయితే ఈ నలుగురిలో అటు వేములవాడ రాజన్న ఆశీస్సులు, అటు బీఆర్ఎస్ అధిష్టానం ఆశీర్వాదం ఎవరికి దక్కేనోననే ఉత్కంఠ నెలకొన్నది. - దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో అధికార పార్టీలో రాజకీయ రగడ మొదలైంది. ఇక్కడి నుంచి టికెట్ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో ఆ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. కాగా, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని మహావృక్షంలా పాతుకుపోయారు. అయితే ఇటీవల అదే పార్టీకి చెందిన ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేములవాడ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
దీంతో ఆయన వర్గీయులు, బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఎమ్మెల్యేకు దడ పుట్టించే విధంగా ఏనుగుల బర్త్ డే సంబురాల జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఎమ్మెల్యేకు పౌరసత్వం రద్దుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వీరితోపాటు నియోజకవర్గంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, గోలి మోహన్ సైతం ఎమ్మెల్యే టికెట్ తమకే ఇస్తారంటూ ఎవరికి వారుగా ఆశవాహ దృక్పథంతో ఉండడం గమనార్హం. అయితే ఈ నలుగురిలో అటు వేములవాడ రాజన్న ఆశీస్సులు, అటు బీఆర్ఎస్ అధిష్టానం ఆశీర్వాదం ఎవరికి దక్కేనోననే ఉత్కంఠ నెలకొన్నది.
చెన్నమనేనికి సిరిసిల్ల మీద పట్టు...
చెన్నమనేని కుటుంబం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. అంతేకాక చెన్నమనేని రాజేశ్వర్ రావు రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఇంకా రాజకీయాల్లోకి రాలేదని స్థానికు మాట. గతం నుంచే రాజకీయాల్లో చిన్నమనేని రాజేశ్వరరావుకు సిరిసిల్ల మీద మంచి పట్టుంది. మూడు దఫాలు సీపీఐ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా కొనసాగాడు. తరువాత టీడీపీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆ తరువాత రేగులపాటి పాపారావు టీఆర్ఎస్ నుంచి గెలుపొందాడు.
తరువాత టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ బాబు గెలుపొందాడు. అప్పటినుంచి వరుస విజయాలతో ముందున్నాడని చెప్పవచ్చు. చెన్నమనేని వంశం ఆర్థికంగా బలంగా ఉండడంతో అప్పడు సిరిసిల్ల ఇప్పుడు వేములవాడ నియోజకవర్గపై మంచి పట్టు సాధించారు. ఇప్పటికీ మంత్రి కేటీఆర్ వేములవాడ నియోజకవర్గ వెళ్తే చెన్నమనేనికి తెలియకుండా ఎటువంటి సభలు, పర్యటనలు ఉండవనేది విశ్లేషకుల మాట.
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన చెన్నమనేని రాజేశ్వరరావు కొడుకు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జర్మనీ నుంచి సేవ్స్ ద్వారా నియోజకవర్గంలో చాలా వాటర్ ట్యాంకులు కట్టడం, కేసీఆర్ తలపెట్టిన కేసీఆర్ కిట్టు జర్మనీలో తయారవుతుందని ఆరోపణలు ఉన్నాయి. అయితే తనపై ఉన్న పౌరసత్వం కేసు విషయంలో కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని, తీర్పు వచ్చే వరకు తనే పోటీలో ఉంటానంటూ ఎమ్మెల్యే రమేష్ బాబు కార్యకర్తలకు ధైర్యం ఇచ్చాడు.
ఏనుగుల మంచి క్రేజ్...
వేములవాడ నియోజకవర్గంపై మంచి పట్టున్న నాయకుళ్లో ఏనుగుల మనోహర్ రెడ్డి ఒకరు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆపదలో ఉన్నానంటే నేనున్నా అంటూ ముందుండి ఆదుకుంటాడని నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి కొండూరి రవీందర్ రావు సమక్షంలో కేటీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఆసమయంలో మనోహర్ రెడ్డికి కేటీఆర్ మంచి స్థానం కల్పిస్తానని మాటిచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అంతేకాక కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో మనోహర్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుందని పదేపదే చెప్పారు. కొండూరి రవీందర్ రావుకు మంచి సత్సంబంధాలు ఉండడం, నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చురుక్క పాల్గొనడం ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వం కేసు కోర్టులో నడుస్తుండగా కోర్టు తీర్పులో ఏమైనా తేడా వస్తే ఏనుగుల మనోహర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఖాయమని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఇదే తరుణంలో ఏనుగుల మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ ప్రజలు మధ్య పెద్దఎత్తున జరపడం విశేషం.
చెన్నమన్నేని వర్సెస్ చల్మెడ..
నియోజకవర్గంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, చెన్నమనేని మధ్య కొన్నాళ్లుగా వర్గ పోరు మొదలైంది. ఇరువురి వర్గాల మధ్య ఫ్లెక్సీల చింపుకోవడం పెద్దఎత్తున వార్తలు రావడంతో కార్యకర్తల మధ్య చాలా బేదాభిప్రాయాలు వచ్చాయి. లక్ష్మీనరసింహారావుకు రాజకీయాలు కొత్తెం కాదని, ఆయన తండ్రి గతంలో ఎంపీగా చేశాడని వాదనలు వినిపిస్తున్నాయి.
చల్మెడ లక్ష్మీ నరసింహరావు వేములవాడ నియోజకవర్గంలోని మల్కాపేటలోని రూ.కోటితో పిల్లలకు పాఠశాల కట్టించాడనే మంచి అభిప్రాయం ఉంది. అంతేకాక నియోజకవర్గ ప్రజలు చల్మెడకు వస్తే ఫ్రీగా ట్రీట్‌మెంట్ కూడా చేస్తారనే పేరు ఉంది. నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటాడనే సదాభిప్రాయంతో అందరి మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. చల్మెడి లక్ష్మీనరసింహారావు కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులు కావడంతో ఎమ్మెల్యే టికెట్ ఆయనకే ఇస్తారనే అభిప్రాయం ఆయన వర్గంలో వ్యక్తం అవుతోంది.
గోలికి కొండంతా ఆశ..
ఉద్యమ సమయంలో గోలి మోహన్ విదేశాల్లో ఉంటూ కేసీఆర్‌కు అండదండగా నిలిచాడనే అభిప్రాయం ఉంది. కేసీఆర్ ఎప్పటికైనా ఉద్యమకారుడిని మర్చిపోడనే నమ్మకంతోపాటు మంచి స్థానం కల్పిస్తాడని, ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తాడని గోలి మోహన్ కొండంత ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఉద్యమకారులకు మంచి స్థానం కల్పించి గోలి మోహన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే.