- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వలేదు
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతున్నది. నిన్న పలువురు ఏఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కమిషన్ విచారణకు హాజరుకాగా మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై వెదిరె శ్రీరాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారంపై ఎన్ డీఏంఏ నివేదికపై చర్చించినట్లు తెలిపారు. కమిషన్ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్లే ప్రాజెక్టును మరోచోట నిర్మించారన్న వాదనలో నిజం లేదన్నారు. తుమ్మడి హెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఆమోదించిందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ దారి తప్పిందన్నారు. మహారాష్ట్రలో ముంపు కారణంగానే గత ప్రభుత్వం ప్రాజెక్టును మరొక చోటుకు మార్చిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు సహజం. కానీ గత ప్రభుత్వం దీన్ని అసహజంగా చిత్రీకరించిందని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పినట్లు వివరించారు. కాళేశ్వరంంలోని బ్యారేజీల నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. మేడిగడ్డ, తుమ్మిడి హట్టి వద్ద ఉన్న నీటి లభ్యతపై కమిషన్ కు వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను కమిషన్ కు అందించానన్నారు. డిజైన్ పూర్తి కాకముందే నిర్మాణాలు జరిగాయని, కన్ స్ట్రక్షన్ పూర్తయ్యాక డీపీఆర్ అప్ డేట్ చేశారని వివరించారు.