- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sama Rammohan Reddy: పాలమూరు ల్యాండ్ స్కామ్ పై కేటీఆర్, హరీశ్ రావు స్పందించండి: సామ
దిశ, డైనమిక్ బ్యూరో: పాలమూరు ల్యాండ్ స్కామ్ (Palamuru land scam) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించాలని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) డిమాండ్ చేశారు. ఫేక్ ఇండ్ల పట్టాలు, స్టాంపులు తయారు చేసి మరీ యధేచ్ఛగా ప్రభుత్వ భూములు అమ్ముకున్న గులాబీ దొంగలు అని ధ్వజమెత్తారు. ఈ కేసులో నిందితులకు బీఆర్ఎస్ (BRS) లీగల్ సెల్ భరోసా ఇస్తుందా కేటీఆర్, హరీశ్ రావు చెప్పాలన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు కాస్త బుర్ర ఉపయోగించి మీ స్పందన కూడా జతచేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో మహబూబ్ నగర్ పట్టణం క్రిస్టియన్ పల్లి శివారులోని ఆదర్శ్ నగర్ 523 సర్వే నంబర్ లో ఉన్న ప్రభుత్వ భూములు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తప్పుడు పత్రాలు, సంతకాలతో విక్రయిచారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పోలీసులకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ టాప్ లీడర్లు స్పందించాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.