Jio Recharge: జియో యూజర్లకు దీపావళి బంపర్ ఆఫర్‌..!!

by Anjali |   ( Updated:2024-10-26 06:55:03.0  )
Jio Recharge: జియో యూజర్లకు దీపావళి బంపర్ ఆఫర్‌..!!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి(Diwali) ఒకటి. ‘నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య() కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది’. అయితే త్వరలో వచ్చే ఈ దీపావళి నేపథ్యంలో ప్రముఖ టెలికాం కంపెనీ యూజర్లకు భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. జియో ట్రూ 5 జీ దీపావళి(Jio True 5G Diwali) ధమాకా పేరుతో యూజర్లకు షాకింగ్ ఆఫర్లను అందిస్తుంది. మరీ ఆ ఆఫర్లు ఏంటి? ఇప్పుడు చూద్దాం..

ఇప్పటికే జియో ఎన్నో రకాల రీఛార్జ్ ఆఫర్ల(Recharge offers)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీపావళి ఫేస్టివల్ ను పురస్కరించుకుని మరిన్ని ఆఫర్లు తీసుకొచ్చింది. రూ. 899, రూ. 5599 రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ప్లాన్స్ తో బ్యాలన్స్ వేసుకునే యూజర్లకు ఎక్ట్స్రా 3350 రూపాయల విలువైన లాభాలు కలిగే చాన్స్ ను కల్పించారు. అలాగే వీరికి ఈజీమై ట్రిప్ కు సంబంధించిన 3000 వోచర్ వస్తుంది. దీన్ని ఎయిర్ ట్రావెల్‌(Air travel)కు, హోటల్స్‌కు వెళ్తే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అజియో షాపింగ్(Azio Shopping) కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం 200 రూపాయల కూపన్(Coupon) వస్తుంది. ఈ ఆఫర్ అక్టోబరు 25 వ తారీకు వరకు ఉంది. అలాగే ఈ కంపెనీ(Company) మరో ఆఫర్ కూడా ప్రకటించింది రూ. 899 తో బ్యాలన్స్ వేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2 జీబీ డేటా.. ఎక్ట్స్ట్రా 20 జీబీ వస్తుంది. అలాగే 3599 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజూ 2.5 జీబీ డేటా వస్తుంది. 365 రోజులతో ఆ ఆఫర్ లభిస్తుంది.

Advertisement

Next Story