- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Priyanka Mohan: విడాకులు తీసుకున్న హీరోతో నిశ్చితార్థం.. అసలు నిజం చెప్పిన ప్రియాంక మోహన్
దిశ, సినిమా: కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi), యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు విడాకులు తీసుకున్న అతను తప్ప పెళ్లి చేసుకోవడానికి వేరే వ్యక్తి దొరకలేదా? అని పలు రకాలుగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని జయం రవి(Jayam Ravi)తో నిశ్చితార్థం గురించి క్లారిటీ ఇచ్చింది. ‘‘జయం రవి(Jayam Ravi), నేను ‘బ్రదర్’(brother) సినిమాలో నటిస్తున్నాము. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్ పెట్టి చిత్రబృందం మా ఇద్దరికి సంబంధించిన ఒక ఫొటో రిలీజ్ చేశారు. అందులో మేమిద్దరం మెడలో పూల దండలు వేసుకుని ఉన్నాము.
దీంతో అది నెట్టింట క్షణాల్లో వైరల్ అయింది. ఇక అది చూసిన వారంతా మాకు ఎంగేజ్‌మెంట్(Engagement) అయిందని అనుకున్నారు. వరుస షూట్స్ వల్ల నేను చాలా బిజీగా ఉండటంతో ఈ విషయం నా దృష్టికి రాలేదు. ఆ సమయంలో ఇది నిజమేనని నమ్మిన టాలీవుడ్(Tollywood)లోని నా స్నేహితులు వరుస కాల్స్ చేసి కంగ్రాట్స్(congrats) చెప్పారు. అప్పుడు నాకు ఏమి అర్థం కాలేదు. అసలు సోషల్ మీడియా(Social Media)లో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోయాను. ఆ తర్వాత పూర్తి విషయాన్ని తెలుసుకుని కాల్ చేసి మరీ అది కేవలం సినిమాలోని స్టిల్ మాత్రమేనని చెప్పాను. ఆ తర్వాత మా మూవీ టీమ్‌ను చాలా తిట్టుకున్నాను.
ఎందుకంటే వారు వేరే ఫొటో ఏదైనా రిలీజ్ చేయొచ్చు కదా ఇది ఎందుకు చేశారు. అందుకే అంతా నిశ్చితార్థం అనుకున్నారని అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది. కాగా, జయం రవి(Jayam Ravi), ఆర్తి(arti)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇటీవల ఏవో మనస్పర్థలు తలెత్తడంతో జయం రవి ఆర్తి(arti)తో విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి షాకిచ్చాడు. కానీ ఈ విషయం నా కూడా తెలియదు అని ఆర్తి పోస్ట్ పెట్టడంతో అంతా మిస్టరీ గా మారిపోయింది.