Shantikanta Das: క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్

by Shamantha N |   ( Updated:2024-10-26 06:34:38.0  )
Shantikanta Das: క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
X

దిశ, బిజినెస్: క్రిప్టో కరెన్సీపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పీటర్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌’ థింక్‌ ట్యాంక్‌కు హాజరైన ఆయన క్రిప్టోల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టోల వల్ల ముప్పు ఉందని పేర్కొన్నారు. ‘ఆర్థికవ్యవస్థలో క్రిప్టో ఆధిపత్యం చెలాయిస్తే సెంట్రల్‌ బ్యాంక్‌ ద్రవ్య వ్యవస్థపై నియంత్రణ కోల్పోతుంది. ఇది ద్రవ్య వ్యవస్థలో అస్థిరతకు దారితీస్తుంది. అంతేకాదు ఆర్థికరంగంపై ప్రభావం చూపుతుంది’’ అని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థపై క్రిప్టోల ఆధిపత్యం ఉండొద్దని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే వాటిని ప్రమాదకరంగా భావిస్తున్నట్లు తెలిపారు.వాటి వల్ల కలిగే భారీ నష్టాలను దృష్టిలోఉంచుకోవాలని.. ఈ సమస్యపై అంతర్జాతీయంగా అవగాహన అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులకు క్రిప్టోలు ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

క్రిప్టోలపై ప్రశ్నించిన భారత్

క్రిప్టో కరెన్సీల గురించి ప్రశ్నించిన తొలిదేశం భారత్ అని శక్తికాంత దాస్ చెప్పుకొచ్చారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ లో క్రిప్టోల అంశంపై అంతర్జాతీయ అవగాహన పెంపొందించేందుకు ఒప్పందం జరిగిందన్నారు. వాటిపై ఆందోళన వ్యక్తంచేసిన సెంట్రల్ బ్యాంకుల్లో ఆర్బీఐ కూడా ఒకటని అన్నారు. క్రిప్టో విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed