Bear Attack : పశువుల కాపరి పై ఎలుగుబంటి దాడి..

by Sumithra |   ( Updated:2024-10-26 06:31:19.0  )
Bear Attack : పశువుల కాపరి పై ఎలుగుబంటి దాడి..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవి ( Black Forest ) ప్రాంతంలోని పదరా మండలం ఉడిమిళ్ళ గ్రామ సమీపంలో గల అడవిలో శనివారం ఉదయం ఓ పశువుల కాపరి పై ఎలుగుబంటి దాడి ( Bear Attacke ) చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం సర్కిల్ తండా ( Circle Tanda ) గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి శనివారం ఉదయం ఉడిబిళ్ళ గ్రామ సమీప అడవిలో కాలెమర్రి వాగు వద్ద ఉన్న పశువుల వద్దకు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఎలుగుబంటి దాడి చేయడంతో తలకు ముఖానికి బలమైన గాయాలు ( injuries ) అయ్యాయన్నారు. ఆ గాయాలతో బాధితుడు నడుచుకుంటూ ఉడిబిళ్ళ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో 108కు సమాచారం అందించి బాధితుని ఆసుపత్రికి తరలించినట్టు గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed