- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cyclone Fengal: తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి అతి భారీవర్షాలు
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Low Pressure) నేడు తుపానుగా రూపాంతరం చెందనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిది. ఆపై ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు వెళ్తుందని పేర్కొంది. ఈ తుపానుకు ఫెంగల్ (Cyclone Fengal)గా నామకరణం చేశారు. తుపాను ప్రభావంతో నేటి నుంచి 5 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది. తుపాను (Cyclone) ప్రభావంతో దక్షిణ కోస్తాతీరంలో (South Coastal Area) గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా.. తుపాను ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఐఎండీ చెప్పింది. తీవ్రవాయుగుండం. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడతాయని.. మత్స్యకారులు శుక్రవారం (నవంబర్ 29) వరకూ వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది.
మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ గ్రామాల్లో దట్టంగా పొగమంచు అలుముకోవడంతో.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.