Sai Dharam Tej: ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి.. యాక్సిడెంట్ రోజును గుర్తు చేసుకున్న మెగా హీరో

by Kavitha |
Sai Dharam Tej: ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి.. యాక్సిడెంట్ రోజును గుర్తు చేసుకున్న మెగా హీరో
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రస్తుతం SDT18 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ్.. ఈ మూవీ తర్వాత బ్రో సినిమాలో అల‌రించారు. ఆ త‌రువాత‌ కాస్త బ్రేక్ తీసుకున్న ఈయన ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం 2025లో రానుంది. ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రంను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఏబీపీ సౌత్ సమ్మిట్‌(ABP South Summit)లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ తనకు యాక్సిడెంట్ అయిన రోజును గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. "ముందుగా లేడీస్, కెమెరామెన్ అందరికీ నమస్కారం.. దయచేసి హెల్మెట్(Helmet) ధరించండి. హెల్మెట్ నా జీవితాన్ని కాపాడింది. నా జీవితాన్ని తిరిగి నాకిచ్చింది. నా వైపు నుండి మీ అందరికీ ఇదొక రిక్వెస్ట్" అంటూ తెలియజేశాడు. ఇక ఇదే విషయాన్ని తను హిందీ, ఇతర భాషల్లోనూ చెప్పాడు.

కాగా 2021 సెప్టెంబర్ 11న తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్‌(Sports Bike)కి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో తేజ్ తలకి పెద్ద దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళాడు. కంటి పై భాగానికి, ఛాతికి, కాలికి కూడా బలమైన గాయాలు కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం చాలా కంగారు పడ్డారు.

(video link credits to ABP Live X account)

Advertisement

Next Story