దయచేసి వందే భారత్ పరువు తీయకండి (ఫొటోస్)

by GSrikanth |   ( Updated:2023-02-04 11:14:32.0  )
దయచేసి వందే భారత్ పరువు తీయకండి (ఫొటోస్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు మురికి కూపాలుగా మారుతున్నాయి. సంక్రాంతి కానుకగా ఇటీవల సికింద్రాబాద్- విశాఖ మధ్య వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొంత మంది ప్రయాణికుల కారణంగా అత్యాధునిక హంగులతో రూపొందించిన వందే భారత్ రైళ్లు చెత్తకుప్పలుగా మారుతున్నాయి. వందే భారత్ ట్రైన్‌లో పెద్దఎత్తున వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు బాధ్యత విస్మరించి ఇలా ప్రవర్తించడంపై మండిపడుతున్నారు. చెత్త పారేయడం కోసం డస్ట్‌బిన్‌లను ఉపయోగించాలని అభ్యర్థిస్తున్నారు. బాధ్యతయుతమైన పౌరులుగా ఉండాలని దయచేసి వందేభారత్ పరువు తీయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed