- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Uttam Kumar Reddy: కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని, కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా జి. నిరంజన్, సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి ఖైరతాబాద్ బీసీ కమీషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నిరంజన్ బీసీ కమీషన్ చైర్మన్ పదవికి సమర్ధుడని, నిజాయితీ గల వ్యక్తిగా పేరున్న నిరంజన్ తన పదవికి హుందాతనాన్ని తీసుకొస్తారని తెలిపారు.
బీసీ కమిషన్ ద్వారా కులగణన తప్పక చేపడతామని, బీసీలకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీసీలను న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోందని, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేందుకే మహేశ్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా ప్రకటించిందని తెలిపారు. రాహుల్ గాంధీ కులగణన కోసమే పోరాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ. హనుమంతరావు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.