- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uttam: అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్(Hyd) అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కట్టుబడి ఉన్నదని, అభివృద్ధిలో రియల్టర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో 14 వ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. రియల్టర్లతో పాటు నిర్మాణాదారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, పాలనాపరమైన అభివృద్ధి ఇకపై సులభతరం కానుందని తెలిపారు. ఇప్పటికే అనుమతులు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్రేడాయి(redai) మరియు ట్రెడాలు(Tedra) ప్రత్యేకమైన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రియల్టర్ల సమస్యల పరిష్కారానికి ఈ కమిటీలతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.
ఇక అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని, ఈ అభివృద్ధిలో రియల్టర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కావాలని కోరారు. అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఉందని, హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో 10 వేల కోట్లు కేటాయింపులు చేసిందని గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్(ORR) నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో నగరాభివృద్ధికి శ్రీకారం చుట్టామని, దీంతో పాటు కనెక్టివిటీ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ట్రాఫిక్ క్రమ బద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రో విస్తరణను వేగవంతం చేసిందని, త్రాగు నీటి సామర్ధ్యం పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు. ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం(Skill University), అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విశ్వవిద్యాలయం(Sports Universtity) నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.