స్కూల్ అసిస్టెంట్‌లుగా భాషా పండిట్‌ పోస్టుల అప్‌గ్రెడేషన్

by Satheesh |
స్కూల్ అసిస్టెంట్‌లుగా భాషా పండిట్‌ పోస్టుల అప్‌గ్రెడేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ద్వారా శనివారం జారీ అయిన ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలో 10,479 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతున్నది. వీరందరినీ స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తిస్తునట్లు ఆ ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం, కన్నడం భాషలను బోధిస్తున్న లాంగ్వేజ్ పండిట్లను ఇక నుంచి ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్)లుగా గుర్తిస్తుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల (పీఈటీ)ను స్కూల్ అసిస్టెంట్ (పీఎడ్)గా గుర్తించనున్నది. మూడేండ్ల క్రితమే ప్రభుత్వం ఈ అప్‌గ్రెడేషన్ కసరత్తు చేసినా కొన్ని కారణాలతో పెండింగ్‌లో పడడంతో ఇప్పుడు అది గాడిన పడింది.

ప్రస్తుతం లాంగ్వేజ్ పండిట్‌లుగా పనిచేస్తున్న 8,630 మందిని ప్రభుత్వం ఇక నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తిస్తున్నట్లు పేర్కొనడంతో తెలుగు భాషకు చెందినవారు 4,493 మంది, హిందీ విభాగంలో 3,883 మంది, ఉర్దూలో 240 మంది, మరాఠీలో 10 మంది, సంస్కృతం, కన్నడం లాంగ్వేజెస్‌లో ఇద్దరి చొప్పున ఉన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సైతం స్కూల్ అసిస్టెంట్‌లుగా అప్‌‌గ్రేడ్ అయిన ఉపాధ్యాయుల్లో తెలుగు మీడియంకు చెందినవారు 1,778 మంది, ఉర్దూలో 62 మంది చొప్పున, మిగిలిన మీడియంలలో మరికొందరు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కేడర్‌లో మార్పులు జరుగుతున్నందున శాంక్షన్డ్ స్ట్రెంథ్ ఎలా ఉన్నదో జిల్లా ట్రెజరీ డిపార్టుమెంటుకు, మండల విద్యాశాఖాధికారికి తిలయజేయాల్సిందిగా జిల్ల ఎడ్యుకేషన్ ఆఫీసర్లను కమిషనర్ ఆదేశించారు

Advertisement

Next Story