- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు: మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ గుండె చప్పుడు వినిపించామని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించామని చెప్పారు. పార్లమెంట్‌లో సుష్మస్వరాజ్ నేతృత్వంలో 160 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు.
బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఓ సందర్భంలో బీఆర్ఎస్ ఎంపీ కేకే చెప్పారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇతర పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని.. ఉద్యమంలో అన్ని వర్గాల పాత్ర ఉందన్నారు.
ఇక, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వత తరుఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ గవర్నర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తొమ్మిదేళ్లలో ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో వివరించేందుకు హైదరాబాద్‌లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.