- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KCR తెలంగాణను నవ్వుల పాలు చేస్తున్నాడు.. కేంద్ర మంత్రి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సరిపోదని ఇక తానే దేశాన్ని ఉద్దరిస్తాను అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన కలుస్తున్న నేతలెవరూ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన చర్యలకు అంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బిహార్ పర్యటనలో కేసీఆర్ పది సార్లు చెప్పినా నితీష్ కుమార్ కూర్చోలేదని, కేసీఆర్ మాటలు వినలేక లేచి వెళ్లిపోయేందుకు నితీష్ ప్రయత్నించారని, ఆయన మాటలకు నితీష్ కుమార్ నవ్వుకున్నారని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నేలను విడిచి సాము చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
బిహార్‌లో తెలంగాణను కేసీఆర్ నవ్వుల పాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ సంపదను బిహార్ కు దోచిపెడుతున్నారని గతంలో విమర్శలు చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు బిహార్‌కు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. దేశానికి నేనే దిక్కు, మా కల్వకుంట్ల కుటుంబమే దిక్కు అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆయన ప్రణాళికలు అన్ని నవ్వుల పాలు చేసేవేనన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రణాళిక తన వద్ద ఉందని కేసీఆర్ అంటున్నారని ఈ ప్రణాళికకు డబ్బులు ఎక్కడివో చెప్పాలన్నారు. తెలంగాణ డబ్బును పంజాబ్, యూపీ, బిహార్‌లో పంచుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం వంటి మతతత్వ పార్టీని పక్కన పెట్టుకుని హైదరాబాద్‌లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం చేస్తుందని ఆరోపించారు. మునావర్ షోకు అంతపెద్ద ఎత్తున భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ఉగ్రవాద కార్యక్రమాలు తగ్గిపోయాయన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఎన్ని ఇళ్లు కట్టించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మోడీ నీతిపరుడని గజ్వేల్‌లో మెచ్చుకున్న కేసీఆర్.. హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే మోడీ చెడ్డవాడిగా, బీజేపీ మతత్వపార్టీగా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ, నరేంద్ర మోడీ భయపడరని స్పష్టం చేశారు. తెల్లవారితే ఈడీ, సీబీఐ పేర్లు జపిస్తూ కేసీఆర్ ఎందుకంత భయపడుతున్నారని విమర్శించారు. భవిష్యత్‌లో తనపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తే సానుభూతి పొందే ప్రయత్నం, కుట్రలను కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అధికారం నుండి కల్వకుంట్ల కుటుంబం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని నితీష్ కుమార్, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ఎవరూ కాపాడలేరని అన్నారు.
కేసీఆర్, టీఆర్ఎస్ పాలన విషయంలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారని.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ కేసీఆర్ ఓడిపోతారని పదవిలో ఉన్నన్ని రోజులైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ మరింతగా బలపడుతోందని అధికారంలోకి వచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కీమ్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా అన్న మీడియా ప్రశ్నకు అది దర్యాప్తులో తేలాల్సిన అంశం అన్నారు. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించమని కేంద్రం సలహా ఇచ్చిందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే అంశం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉందని స్పష్టం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.