తెలంగాణ నిరుద్యోగ యువతకు CM కేసీఆర్ వెన్నపోటు పొడిచారు: కిషన్ రెడ్డి ఫైర్

by Satheesh |   ( Updated:2023-09-13 13:48:29.0  )
తెలంగాణ నిరుద్యోగ యువతకు CM కేసీఆర్ వెన్నపోటు పొడిచారు: కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇందిరాపార్క్ వద్ద ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో బుధవారం బీజేపీ 24 గంటల నిరాహార దీక్షను చేపట్టింది. ఈ దీక్ష బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. కాగా గురువారం ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో లక్షలాది నిరుద్యోగులు తిండి లేక ఉన్నారని ఫైరయ్యారు. వారికి సంఘీభావంగా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో 1969లో 300 మంది యువతను కాల్చి చంపారని చెప్పారు. మంత్రి హరీశ్ రావు పెట్రోల్ పోసుకున్నారని, కానీ ఆయనకు ఇంతవరకు అగ్గిపెట్టె దొరకలేదని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. నోటిఫికేషన్ల ఇచ్చినట్లే ఇచ్చి కోర్టు కేసులతో ప్లాన్ ప్రకారం నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కార్ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తారా? అని ఆయన ఫైరయ్యారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య పాపం రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? అని ఆయన విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో పరిశ్రమ పెట్టాలంటే బీఆర్ఎస్ నేతలకు వాటాలు ఇవ్వాల్సిందేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆయన తెలిపారు. యూనివర్శిటీ విద్యార్థులను పోలీసలు కొట్టిన దాఖలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా లేవని ఆయన ఫైరయ్యారు. రానున్న రోజుల్లో మిలియన్ మార్చ్ చేపట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతరేస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్‌కు ఆర్థికసాయం చేస్తున్నారని ఆరోపించారు.

More News : ఆ పాపంలో నేనూ సహకరించా: MP Dharmapuri Arvind

Advertisement

Next Story

Most Viewed