ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మళ్ళీ ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

by Javid Pasha |
ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మళ్ళీ ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిటైర్ అయిన ఉద్యోగులకు మళ్లీ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు వేగవంతంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 28న హకీంపేటలో ఎక్స్-సర్వీస్‌మెన్ కోసం భారీ స్థాయిలో జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అందరికీ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. రక్షణ శాఖ విభాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్, రిటైర్ అయిన సాయుధ బలగాల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా సెమినార్లు, జాబ్‌మేళాలు నిర్వహిస్తోందన్నారు. సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన ఎక్స్-సర్వీస్‌మెన్ కు కార్పొరేట్ కంపెనీలు, పీఎస్‌యూలకు ఈ సెమినార్లు వారథిగా పనిచేస్తున్నాయన్నారు.

జాబ్‌మేళాల ద్వారా ఇటు మాజీ సైనిక ఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థలకు.. ఇరువురికీ పరస్పర లబ్ధి చేకూరుతుందన్నారు. ఇరువురికీ ఒకరి అవసరాలు, అవకాశాలు మరొకరికి తెలిసేందుకు వీలుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ సేవలో పనిచేసిన వీరికి మళ్లీ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కలుగుతుందని తెలిపారు. త్రివిధ దళాల్లో పనిచేసిన వారు 37 నుంచి 57 ఏళ్ల లోపు వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. జాబ్‌మేళా కేంద్రంలో అందరికీ అవసరమైన వసతులు కల్పిస్తామని తెలిపింది. ఈ మేళాలో పాల్గొనాల్సిన వారు https://dgrindia.gov.in నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed