Union Budget : మొత్తం కేంద్ర బడ్జెట్ పరిమాణం ఎంతంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-23 07:31:44.0  )
Union Budget : మొత్తం కేంద్ర బడ్జెట్ పరిమాణం ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు ఉండగా.. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లుగా కేంద్రం వెల్లడించింది. ఇందులో పన్నుల ద్వారా ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు సమకూరగా.. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. కాగా, ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహిళాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్ద పీట వేసింది. ఏపీ రాజధానికి రూ.15వేల కోట్లను కేంద్రం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.


Union Budget : బంగారం, వెండి కొనాలనుకునే వారికి కేంద్రం తీపి కబురు

Advertisement

Next Story