- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్బరుద్దీన్ కొడంగల్ నుంచి పోటీ చేస్తే.. డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అక్బరుద్దీన్ ఒవైసీకి సంచలన సవాల్ విసిరారు. ఈ రోజు బోనాల పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీలో పర్యటించిన బండి.. ఒవైసీ బ్రదర్స్ పై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీలో చేరితే.. తాను రాజీనామా చేసి.. కొడంగల్ నుంచి పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపిస్తానని అన్నారని విలేకర్లు గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. ఒవైసీ గతంలో బీఆర్ఎస్ పార్టీతో.. నేడు కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతన్నారని.. ఎంఐఎం పార్టీ అంటేనే గోడమీద పిల్లి పార్టీ అని.. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడుతారని బండి విమర్శలు చేశారు. అలాగే సీఎం రేవంత్ కోరిక మేరకు ఒవైసీ కాంగ్రెస్ పార్టీలో చేరి కొడంగల్ నుంచి పోటీ చేస్తే.. బీజేపీ పార్టీ అతనికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తుందని.. తన సవాల్‌ను స్వికరించే దమ్ముందా అని బండి సంజాయ్ సవాల్ విసిరారు.