- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయం దిశగా కాంగ్రెస్.. నిరుద్యోగుల సంబురాలు
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం రెండో స్థానంలో వెనుకంజలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 30 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిచింది. ఇంకా పలు స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లోనే ఉంది. దీంతో కాంగ్రెస్ జోరు కొనసాగుతుండటంతో నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వస్తే తమకు ఉద్యోగాలు తప్పక వస్తాయనే భావనలో వారు ఉన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీక్‌లు, వరుసగా ఎగ్జామ్ పోస్ట్ పోన్‌లు, నోటిఫికేషన్లు సరైన సమయంలో వేయకపోవడం లాంటి చర్యల వల్ల నిరుద్యోగులు కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వారంతా కలిసి ఈ సారి ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుకున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగ బస్సు యాత్ర కూడా చేపట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ గెలుపు కోసం నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు.