- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో రాజ్యాంగవిరుద్ధ పాలన నడుస్తుంది.! ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
దిశ, వెబ్ డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ పాలన కొనసాగిస్తుందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజీపీ కాలరాస్తోందని, పార్లమెంట్ సమావేశాల్లో.. సొంత ఎజెండాతో ముందుకు వెళ్లడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలో శాంతిభద్రతలు లోపించాయని, రోజురోజుకు మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల మహిళలకు కనీస భద్రత కూడా లేకుండా పోతుందని అన్నారు. కోల్ కతా లో జూనియర్ డాక్టర్ పైన జరిగిన ఘటన చాలా దారుణమని, ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని ఎంపీ అన్నారు. కాబట్టి మహిళల భద్రత మరింత పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఎంపీ గడ్డం వంశీ. దేశంలో యువత రాజకీయాల్లోకి రావాలని, అన్నిరంగాల్లో యువత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు గడ్డం వంశీకృష్ణ.