టీ20 వరల్ట్ కప్ లో హిస్టరీ క్రియేట్ చేసిన ఉగాండా బౌలర్

by Prasad Jukanti |
టీ20 వరల్ట్ కప్ లో హిస్టరీ క్రియేట్ చేసిన ఉగాండా బౌలర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఉగాండా తొలి విజయం నమోదు చేసుకుంది. గురువారం ప్రావిడెన్స్ వేదికగా పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఉంగాడా పపువా న్యూగినియాను 19.1 ఓవర్లలో 77 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఉగాండా సీనియర్‌ బౌలర్‌ సుబుగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 4 పరుగులను మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు (4-2-4-2) పడగొట్టాడు. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఇదే అత్యంత ఉత్తమ ఎకానమీ (1.00) బౌలింగ్‌. 43 ఏళ్ల వయసులో సుబుగా ఈ రికార్డు నమోదు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పపువా న్యూగినియా నిర్దేశించిన 78 పరుగల టార్గెట్ ను ఉగాండా18.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఛేదించింది.

Advertisement

Next Story