కల్లుబట్టిలో మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు.. అంతలోనే..

by Sathputhe Rajesh |
కల్లుబట్టిలో మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు.. అంతలోనే..
X

దిశ, నిజామాబాద్ క్రైమ్ : నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం నాగారం పాత కల్లుబట్టి (వడ్డెర సంఘం)లో జరిగింది. నాగారం కు చెందిన పట్టేవార్ యాదూ(40)ని అదే కాలనీకి చెందిన ఠాకూర్ విక్రమ్ సింగ్ హత్య చేశాడు. ఉదయం వేళ స్థానికంగా బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసిన ఇద్దరు పాత కల్లు బట్టిలో మద్యం సేవించినట్టు తెలిసింది.

ఇద్దరి మధ్య జరిగిన గొడవలో యాదూనూ హత్య చేసినట్టు తెలిసింది. యాదును హత్య చేసి తానే అతన్ని చంపానని అతని కుటుంబ సభ్యులకు తెలిపి పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. కూలి పని చేసుకునే ఇద్దరి మధ్య గొడవకు కారణాలు తెలియలేదు. ఐదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుడు యాదుకు ఇద్దరు పిల్లలు కాగా భార్య పిల్లలు నాందేడ్ జిల్లాలో ఉంటున్నట్టు తెలిసింది. కూలి పనులు చేస్తూ ఆకతాయిగా వ్యవహరించే విక్రం తోటి కూలి పని చేసే వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపింది.

Advertisement

Next Story

Most Viewed